తెలంగాణలో కలకలం రేపుతున్న కిడ్నాప్ హత్యలు

తెలంగాణలో కలకలం రేపుతున్న కిడ్నాప్ హత్యలు
x
Highlights

తెలంగాణలో ఈ మధ్య కిడ్నాప్‌లు చేయడం అనంతరం హత్య చేసిన ఘటనలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే మహబూబాబాద్‌లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ను...

తెలంగాణలో ఈ మధ్య కిడ్నాప్‌లు చేయడం అనంతరం హత్య చేసిన ఘటనలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే మహబూబాబాద్‌లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి గంట వ్యవధిలోనే హత్య చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తి పోలీసులకే తెలియని టెక్నాలజీని వాడాడు. ఈ ఘటన మరువక ముందే మేడ్చల్ జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో అధియాన్ అనే 5ఏళ్ల బాలుడ్ని ఓ యువకుడు కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన మేడ్చల్, హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది.

శామీర్‌పేటకు చెందిన సయ్యద్ యూసఫ్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యూసఫ్, గౌసియాలకు ఒక కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు అధియాన్ ఈ నెల 12న ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎక్కడికెళ్లాడా..? అని తల్లిదండ్రులు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వెతికారు. అధియాన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలా రెండ్రోజుల పాటు అధియాన్ కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు, బంధువులు చివరికి 15న బాలుడు కనిపించట్లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది.! అయితే పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోకుండా అలసత్వం వహించడంతో ఈ ఘోరం జరిగిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. చివరికి అదే ఇంట్లో కిరాయికి ఉంటున్న యువకుడు.. బాలుడ్ని కిడ్నాప్ చేశాడని తేలింది. కిడ్నాప్ చేసిన రోజే అధియాన్‌ను ఆ యువకుడు హత్య చేశాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. కిడ్నాప్ చేసి బాలుడ్ని తానే చంపానని యువకుడు పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు. ఘటనపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories