Manikrao Thakre: బీఆర్ఎస్‌ కంటే ఎక్కువ సంఖ్యలోనే బీసీలకు సీట్లు ఇస్తాం

Manikrao Thakre: వామపక్షాలకు సీట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయి

Shekhar G
Published on: 22 Oct 2023 9:22 AM IST
Telangana Congress Screening Committee Meeting In Delhi
X

Manikrao Thakre: బీఆర్ఎస్‌ కంటే ఎక్కువ సంఖ్యలోనే బీసీలకు సీట్లు ఇస్తాం

Manikrao Thakre: తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నామని చెప్పారు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రే. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్‌ చేస్తామని, సీఈసీ సమావేశం తర్వాతనే రెండో జాబితానా..? లేక మూడో జాబితానా..? అనేది తేలుతుందని అన్నారు. వామపక్షాలకు సీట్ల కేటాయింపుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు. బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారన్న థాక్రే.. బీఆర్ఎస్‌ కంటే ఎక్కువ సంఖ్యలోనే బీసీలకు సీట్లు కేటాయిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఐదున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో రెండో జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు.

Shekhar G

Shekhar G

Next Story