కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన తీరుపై టీ.కాంగ్రెస్ నిరసన

*విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ సౌద ముట్టడికి పిలుపు

Rama Rao
Updated on: 7 April 2022 8:00 AM IST
Telangana Congress Protests Against the Rule of the Central and State Governments
X

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన తీరుపై టీ.కాంగ్రెస్ నిరసన

Telangana Congress: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన బాట పట్టారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ సౌదా ముట్టడించనున్నారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నారు. కార్యకర్తల నుండి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించుకున్నట్లు సమాచారం. యువత మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలన్న రేవంత్ రెడ్డి.., రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత నిరసన కార్యచరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story