తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల పర్వం

Arun Chilukuri
Published on: 13 Feb 2021 8:35 PM IST
తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల పర్వం
X

తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల పర్వం

తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టగా.. కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేత కోమటిరెడ్డి పాదయాత్ర షురూ చేస్తున్నారు. ఈనెల 20 నుంచి 26 వరకు నార్కట్‌పల్లి నుంచి SLBC వరకు కోమటిరెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. SLBC నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మొత్తం ఆరు రోజులపాటు పాదయాత్ర చేయనున్నట్లు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 22 నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సదాశివపేట నుంచి హైదరాబాద్ గన్ పార్క్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story