కాసేపట్లో రాహుల్‌ గాంధీతో టీకాంగ్రెస్‌ నేతల భేటీ

Telangana Congress: రేవంత్‌రెడ్డితో సహా 14మందికి అపాయింట్‌మెంట్

Rama Rao
Updated on: 30 March 2022 3:45 PM IST
Telangana Congress leaders meet Rahul Gandhi for a while
X

కాసేపట్లో రాహుల్‌ గాంధీతో టీకాంగ్రెస్‌ నేతల భేటీ

Telangana Congress: కాసేపట్లో రాహుల్‌ గాంధీతో టీకాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. రేవంత్‌రెడ్డితో సహా 14మందికి అపాయింట్‌మెంట్ ఖారారు అయ్యింది. తెలంగాణలో పార్టీ పరిస్థితి.. పార్టీ సభ్యత్వాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సభ్యత్వ నమోదు చెక్కును కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీకి అందజేయనున్నారు.

రాహుల్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌తో సైతం టీకాంగ్రెస్‌ నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎల్పీ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లు మధు యాష్కీ, దామోదర రాజనర్సింహ, మహేశ్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి పాల్గొననున్నారు.

Rama Rao

Rama Rao

Next Story