Manickam Tagore: నేడు హైదరాబాద్‌కు మాణిక్కం ఠాగూర్

Manickam Tagore: రాహుల్ గాంధీ సభ, జిల్లాల్లో పార్టీ పటిష్టతపై చర్చ

Rama Rao
Published on: 15 April 2022 9:21 AM IST
Telangana Congress Incharge Manikyam Tagore will Arrive in Hyderabad Today
X

Manickam Tagore: నేడు హైదరాబాద్‌కు మాణిక్కం ఠాగూర్

Manickam Tagore: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ నేడు హైదరాబాద్ రానున్నారు. పీసీసీ కార్యవర్గంతో భేటీకానున్నారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ అనుబంధ ఛైర్మన్‌తో ఠాగూర్ సమావేశంకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఇందిరాభవన్‌లో సీనియర్ నేతలతో సమావేశంకానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో గాంధీభవన్‌లో సమావేశం అవుతారు. రాహుల్ సభ, జిల్లాలో పార్టీ పటిష్టతపై చర్చించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ సభలోపు ముఖ్య నాయకుల చేరికలపై దృష్టి సారించాలని పీసీసీకి ఠాగూర్ సూచనలు చేయనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story