ఇవాళ హైదరాబాద్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్

Manickam Tagore: 3 రోజుల పాటు తెలంగాణలో ఉండనున్న ఠాగూర్

Jyothi
Updated on: 12 Sept 2022 8:30 AM IST
Telangana Congress Incharge Manickam Tagore to Hyderabad Today
X

ఇవాళ హైదరాబాద్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్

Manickam Tagore: మునుగోడులో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో మళ్లీ కాంగ్రెస్‌ జెండా ఎగరవేసేలా స్కెచ్‌ వేస్తోంది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్‌కు రానున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండనున్న ఠాగూర్.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచార ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఇవాళ సీనియర్ నేతలతో మునుగోడు నియోజకవర్గ మండల ఇంఛార్జ్‌లతో మాణిక్కం ఠాగూర్ సమావేశంకానున్నారు. రేపు మునుగోడు వెళ్లనున్న ఆయన.. మండల బూత్ ఇంఛార్జ్‌లు, సీనియర్‌లతో భేటీకానున్నారు. ఇక ఈనెల 14న గాంధీభవన్‌లో సీనియర్ నేతలతో మునుగోడు ఉపఎన్నికపై చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story