logo
తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్‌లో రాహుల్ సభ కాక

Telangana Congress Graph Increased After Rahul Gandhi Meeting
X

తెలంగాణ కాంగ్రెస్‌లో రాహుల్ సభ కాక

Highlights

Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్‌లో రాహుల్ సభ కాక రేగుతోంది. నివురు గప్పిన నిప్పులా రాజుకుంటోంది.

Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్‌లో రాహుల్ సభ కాక రేగుతోంది. నివురు గప్పిన నిప్పులా రాజుకుంటోంది. కోవర్టులంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కొందరు సీనియర్లు మధనపడుతున్నారు. రాహుల్ గాంధీ ఇలా మాట్లాడితే పార్టీలో భవిష్యత్ ఏంటని నేతలు బెంగపడుతున్నారు. రాహుల్ తీరుపై నేతలు మండిపడుతున్నారు. కోవర్టులంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలతో... కార్యకర్తలు జగ్గారెడ్డి అంటూ కేకలు వేయడంతో రగడ అంతకంతకూ పెరుగుతోంది.

రాహుల్ గాంధీ అలాంటి కామెంట్స్ చేస్తే ఇక ఎలా అన్న చర్చ మొదలైంది. పార్టీ అగ్రనేత తీరుపై జగ్గారెడ్డి గుస్సాగా ఉన్నట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టికి...రాహుల్ పరోక్ష హెచ్చరికలు పంచారంటున్నాయ్ పార్టీ వర్గాలు... అదే సమయంలో ఇటీవల గళం విప్పుతున్న వీహెచ్, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ విషయంలోనూ రాహుల్ ఒక క్లారిటీ వచ్చారని నేతలు చెప్పుకుంటున్నారు. ఎవరికి చెప్పుకోలేక లోలోపలే నేతలు వేదనపడుతున్నట్టు గాంధీ భవన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయ్.

Web TitleTelangana Congress Graph Increased After Rahul Gandhi Meeting
Next Story