TS Congress: ఇవాళ తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ భేటీ

TS Congress: సెప్టెంబర్ మొదటి వారంలో మొదటిదశ అభ్యర్థుల ప్రకటనకు ఛాన్స్

Shekhar G
Published on: 14 Aug 2023 10:00 AM IST
Telangana Congress Election Committee Meeting Today
X

TS Congress: ఇవాళ తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ భేటీ

TS Congress: ఇవాళ తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన సమావేశంకానున్నారు. ఈ భేటీకి టీపీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్, సభ్యులు హాజరుకానున్నారు. అభ్యర్థుల ఎంపికపై అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించనున్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్లాన్ చేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం సునీల్ కనుగోలు సర్వేతో పాటు.. వివిధ సర్వే నివేదికలను పరిగణలోకి తీసుకోనుంది ఎన్నికల కమిటీ. ఎన్నికల కమిటీ సూచించిన అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ మరోసారి పరిశీలించనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో మొదటిదశ అభ్యర్థుల ప్రకటనకు సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.

Shekhar G

Shekhar G

Next Story