FIDE World Cup 2025: కోనేరు హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy’s congratulatory message to Koneru Humpy
x

FIDE World Cup 2025: కోనేరు హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Highlights

Koneru Humpy: జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్‌లో భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు ప్రౌడ్ కోనేరు హంపి అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు.

Koneru Humpy: జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్‌లో భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు ప్రౌడ్ కోనేరు హంపి అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. ఆమె క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌ను 1.5-0.5 తేడాతో ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచారు.

తెలుగు తేజానికి ప్రశంసల వెల్లువ

హంపి విజయంపై దేశవ్యాప్తంగా నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. "వరల్డ్ కప్ సెమీఫైనల్లో చేరిన తొలి భారతీయ మహిళగా కోనేరు హంపి చరిత్ర సృష్టించింది. ఇది తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తుది విజయం సాధించాలని కోరుకుంటున్నాను," అని ఆయన ట్వీట్ చేశారు.

ఇక మరో భారతీయులు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. మొదటి రెండు గేమ్స్ డ్రా కావడంతో మ్యాచ్ టైబ్రేకర్‌కు వెళ్లింది. టైబ్రేకర్ రౌండ్ నేడు (సోమవారం) జరగనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories