CM Revanth Reddy: ఢిల్లీలో సోనియాగాంధీని కలిసిన తెలంగాణ సీఎం రేవంత్‌

CM Revanth Reddy: ఢిల్లీలో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు.

Arun Chilukuri
Published on: 16 Dec 2025 5:00 PM IST
CM Revanth Reddy: ఢిల్లీలో సోనియాగాంధీని కలిసిన తెలంగాణ సీఎం రేవంత్‌
X

CM Revanth Reddy: ఢిల్లీలో సోనియాగాంధీని కలిసిన తెలంగాణ సీఎం రేవంత్‌

CM Revanth Reddy: ఢిల్లీలో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియా గాంధీకి అందజేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను సోనియా గాంధీకి సీఎం రేవంత్‌ చెప్పారు. తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ను సోనియాగాంధీ అభినందించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story