Revanth Reddy: వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

Telangana CM Revanth Reddy Inaugurated Vanamahotsavam 2025
x

Revanth Reddy: వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్కను నాటారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి తిలకించి, మొక్కల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా అందర్నీ పిలుపునిచ్చారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం కోరారు. "తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు మనందరం కృషి చేయాలి" అని సీఎం పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories