సీఎంల సమావేశం పెట్టండి.. ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

Cm KCR: ధాన్యం సేకరణపై ప్రధాని మోడీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri
Updated on: 23 March 2022 9:15 PM IST
Telangana Cm Kcr Writes To Pm Modi On Paddy Procurement
X

సీఎంల సమావేశం పెట్టండి.. ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

Cm KCR: ధాన్యం సేకరణపై ప్రధాని మోడీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ధాన్యం సేకరణపై జాతీయ స్థాయిలో ఒకే విధానం రూపొందించాలని కోరారు సీఎం కేసీఆర్. వ్యవసాయరంగ నిపుణులు, సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో సగానికిపైగా జనాభా వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారని ప్రజల బ్రతుకుదెరువుకు వ్యవసాయమే ఆధారమన్నారు సీఎం కేసీఆర్. దేశ ఆర్థిక వ్యవస్థలో ముడి సరుకుగా వ్యాపార అవసరాలు తీరుస్తూ వ్యవసాయ రంగం కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఇక స్థిరమైన, ప్రగతిశీల రైతు అనుకూల విధానాన్ని అనుసరించాలని సూచించారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story