వారణాసిని సందర్శించిన కేసీఆర్‌ భార్య, కూతురు

వారణాసిని సందర్శించిన కేసీఆర్‌ భార్య, కూతురు
x

వారణాసిని సందర్శించిన కేసీఆర్‌ భార్య, కూతురు

Highlights

*వారణాసిలో సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, కల్వకుంట్ల కవిత పర్యటన *అస్సీ ఘాట్‌ నుంచి దాశాశ్వమేధ ఘాట్‌ వరకు బోటులో ప్రయాణం *అనంతరం ప్రాచీన సంకట్ మోచన్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు

వారణాసిలో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్‌ సతీమణి శ్రీమతి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అస్సీ‌ ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బోట్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అస్సీఘాట్‌ నుంచి దశాశ్వేమేధ ఘాట్‌ వరకు పడవ ప్రయాణం చేశారు. అనంతరం తల్లీకూతుళ్లు దశాశ్వేమేధ ఘాట్‌లో గంగా నదికి హారతిచ్చారు. తరువాత ప్రాచీన సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కవిత సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories