CM KCR to Visit Yadadi Temple: నేడు యాదాద్రి పర్యటనకు సిఎం కేసీఆర్...

CM KCR to Visit Yadadi Temple | తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదాద్రి క్షేత్రంలో పర్యటించనున్నారు.

S. Srikanth
Updated on: 13 Sept 2020 5:27 PM IST
CM KCR to Visit Yadadi Temple:  నేడు యాదాద్రి పర్యటనకు సిఎం కేసీఆర్...
X

CM KCR to Visit Yadadi Temple | తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదాద్రి క్షేత్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మర్గాన యాదాద్రి చేరుకోనున్నారు. తొలుత బలాలయంలో నరసింహ స్వామిని దర్శించుకుని ప్రేత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిని పరిశీలించనున్నారు. సాయంత్రం వైటీడీఏ అధికారులతో భేటీ కానున్నారు. ఇటు సీఎం పర్యటనతో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే, ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఒక నివేదక రూపంలో సిద్ధం చేసారని సమాచారం..

గత ఏడాది డిసెంబర్‌లో కేసీఆర్ యాదాద్రి వెళ్లారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు వెళ్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మిస్తోంది. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులతో యాదాద్రిలో ఎక్కడ చూసిన కొత్త నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు యాదగిరిగుట్టను చూసిన వారు ఇపుడు యాదాద్రిని చూస్తే ఆ ప్రాంత అభివృద్ధిని అసలు నమ్మలేకపోతున్నారు. భక్తులకు స్వామి వారి దర్శనం ఎంత ముఖ్యమో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కూడా అంతే లక్ష్యంగా వైటీడీఏ పనులను చేపడుతోంది.

S. Srikanth

S. Srikanth

Next Story