నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ


తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు గురువారం ముగియనుంది. దీంతో ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరనుంది.
తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు గురువారం ముగియనుంది. దీంతో ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరనుంది. ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తూ గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లను ప్రకటించి రెడ్ జోన్ మినహా మిగతా జోన్లకు కొన్ని సడలింపులు ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ గ్రీన్, ఆరెంజ్ జోన్లకు సడలింపులు ఇస్తారా అనేది ఆశస్తిగా మారింది. కేంద్రం మే 17 వరకు విధించిన లాక్ డౌన్ .. కేసీఆర్ తెలంగాణ లో 21వరకు పొడిగించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు ప్రారంభం కావడం రాష్ట్ర సర్కారును ఇబ్బంది పెడుతోంది. రాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా ఉన్న తెలంగాణ వాసులు.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం కొనుక్కుంటున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ఈ కేబినెట్‌లో ప్రధానంగా చర్చించనున్నారు.
ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల, గ్రీన్ జోన్ల పరిధిలో పరిశ్రమలు అనుమతులతో సహా ఇతర అంశాలు చర్చించనున్నారు. టెన్త్, ఎంసెట్, సెట్ పరీక్షల నిర్వహణ, ధాన్యం కొనుగోళ్లు సహా వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



