తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్ కుటుంబం.. రేపు సీఎం స్టాలిన్‌తో భేటీ...

KCR - Tamil Nadu Tour: పూర్ణకుంభంతో స్వాగతం పలికిన కలెక్టర్, తమిళ మంత్రి...

Shireesha
Published on: 13 Dec 2021 6:04 PM IST
Telangana CM KCR Tamil Nadu Tour and Meeting with CM Stalin Tomorrow | Telangana News Today
X

తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్ కుటుంబం.. రేపు సీఎం స్టాలిన్‌తో భేటీ...

KCR - Tamil Nadu Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లారు.. కుటుంబ సమేతంగా శ్రీరంగం పట్టణం చేరుకుని శ్రీరంగ నాథ స్వామిని దర్శించుకున్నారు.. రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో కేసీఆర్ కు పూర్ణకుంభ స్వాగతం లభించింది. తిరుచ్చి జిల్లా కలెక్టర్ శ్రీనివాసు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్ కు స్వాగతం పలికారు.

వేద మంత్రాలతో ఆలయంలోకి తీసుకెళ్లి స్వామి దర్శనం చేయించారు. ఇదిలా ఉంటే.. రేపు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీకానున్నారు సీఎం కేసీఆర్. తిరుత్తణిలో ఓ కార్యక్రమం తర్వాత కేసీఆర్, స్టాలిన్ సమావేశం కానున్నారు.

Shireesha

Shireesha

Next Story