Telangana: నీటిపారుదల శాఖపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష

* గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు కార్యాచరణపై సుధీర్ఘ చర్చ * గోదావరి, కృష్ణా జలాల నీటివాటాల గురించి సమీక్ష

Sandeep Reddy
Updated on: 7 Aug 2021 8:16 AM IST
Telangana CM KCR Review Meeting on Irrigation Department
X

 సీఎం కేసీఆర్‌ (ఫైల్ ఫోటో)

Telangana: నీటిపారుదల శాఖపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష నిర్వహించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను క్షుణ్ణంగా సమీక్షించారు. కృష్ణా, గోదావరి జలాల్లో ఉభయ రాష్ట్రాలకుండే నీటివాటాల గురించి విసృతంగా సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సాగునీటి హక్కుల కోసం వెనకడుగు వేసే ప్రసక్తేలేదని సీఎం స్పష్టం చేశారు. అందుకు ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని సీఎం మరోసారి గుర్తుచేశారు. బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఉన్నతాధికారులకు సూచించారు. తిరిగి ఇదే అంశంపై ఇవాళ మరోసారి సమావేశం కావాలని సీఎం నిర్ణయించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story