ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్

X
Highlights
సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. హస్తినాలో రెండు, మూడు రోజుల పాటు...
Arun Chilukuri11 Dec 2020 9:36 AM GMT
సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. హస్తినాలో రెండు, మూడు రోజుల పాటు ఉండనున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ను సీఎం కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఇతర ప్రాజెక్టుల పెండింగ్ గురించి కేంద్ర మంత్రితో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్రసింగ్ షెకావత్, హర్దీప్‌సింగ్ పురి, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్ తదితరులను కలిసే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు.
Web TitleTelangana CM KCR leaves for Delhi
Next Story