KCR - Yadadri: ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్

KCR - Yadadri: పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం

Shireesha
Published on: 11 March 2022 7:03 AM IST
Telangana CM KCR Going to Yadadri to Attend Sri Lakshmi Narasimha  Swamy Kalyanam Today 11 03 2022 | Live News
X

KCR - Yadadri: ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్

KCR - Yadadri: ఇవాళ సీఎం కేసీఆర్‌ యాదాద్రి క్షేత్ర పర్యటన చేయనున్నారు. అలాగే లక్ష్మీనరసింహుల కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. యాదాద్రి దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొండపైన ప్రధాన ఆలయం భక్తుల దర్శనాలకు సిద్ధమైంది.

కృష్ణ శిలలతో లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. క్యూలైన్లు భక్తిభావం ఉట్టిపడేలా స్వర్ణకాంతులీనుతోంది. కొండపైన, దిగువన పచ్చదనం పరచుకుని ప్రకృతి సోయగాలు సంతరించుకున్నాయి. భక్తులకు మరపురాని మధురానుభూతి పంచేలా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు. స్వయంభువుల దర్శనాలకు చకచకగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణంతో పాటు పచ్చదనం, సుందరీకరణ పనులు నిర్విరామంగా సాగుతున్నాయి.

Shireesha

Shireesha

Next Story