CM KCR: 12 నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన.. కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం

CM KCR: ఈనెల 12న మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో పర్యటన

Jyothi
Published on: 9 Jan 2023 6:27 AM IST
Telangana CM KCR Districts Tour
X

CM KCR: 12 నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన.. కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి జిల్లాల బాట పడుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్..ఈనెల 12 నుంచి మరోసారి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈసారి కేసీఆర్ చేతుల మీదుగా ఈనెలలో నూతనంగా మరో మూడు సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభంకానున్నాయి. ఈనెల 12న ఉదయం మహబూబాబాద్‌ జిల్లా నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం..అదేరోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సంక్రాంతి పండగ తర్వాత 18న ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని సైతం ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్‌.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సకల సదుపాయాలతో జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి కూడా వచ్చాయి. మరికొన్ని నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. మరికొన్ని తుదిదశ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటితో పాటు ప్రతీ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను సైతం నిర్మిస్తోంది. వీటిలో ఇప్పటివరకు అనేక కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.

Jyothi

Jyothi

Next Story