ఏడిద గోపాలరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం!

ఏడిద గోపాలరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం!
x
Highlights

ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రంగా వార్తలు చదివిన ఏడిద గోపాలరావు మృతి చెందిన సంగతి తెలిసిందే.. అయితే అయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.

ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రంగా వార్తలు చదివిన ఏడిద గోపాలరావు మృతి చెందిన సంగతి తెలిసిందే.. అయితే అయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు.. రేడియోలో వార్తలు చదవడం ద్వారా మాత్రమే కాకుండా రంగస్థల నటుడిగా కూడా గోపాలరావు పేరు ప్రఖ్యాతలు సంపాదించారని సీఎం గుర్తు చేశారు. శ్రీ గోపాలరావు వివిధ సాంస్కృతిక సంస్థలు, సంఘాల కార్యక్రమాలకు ఇతోధిక సహాయ సహకారాలు అందించారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్.

గోపాలరావు వయస్సు ప్రస్తుతం 83 సంవత్సరాలు. న్యూఢిల్లీ ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా ఏడిద గోపాలరావుకు 30 ఏళ్లగా పనిచేశారు. అంతేకాకుండా అక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సరస నవరస సంస్థను స్థాపించి ఢిల్లీలో, హైదరాబాద్ లో జాతీయ నాటకోత్సవాలు కూడా నిర్వహించారు. ఢిల్లీ వచ్చిన తెలుగు వారికి అయన మంచి ఆతిథ్యాన్ని ఇచ్చేవారు. నేతాజీ నాటకంలో గాంధీజీ వేషానికి పరిచయం చేయగా,గాంధీ ప్రధాన పాత్రగా బాపూ చెప్పిన మాట నాటికను డా విజయ భాస్కర్ తో వ్రాయించి దాదాపు 50 ప్రదర్శనలిచ్చారు. ఆయన సోదరుడు ప్రముఖ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. ఈయన కళాతపస్వీ కే. విశ్వనాధ్ తో ఎక్కువ సినిమాలు చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories