Telangana: 8వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet to Meet on Tuesday
x

కాబినెట్ సమావేశం (ఫైల్ ఇమేజ్)

Highlights

Telangana: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో తెలంగాణ సర్కార్ *అన్‌లాక్ ప్రక్రియపై దృష్టి సారించినట్టుగా సమాచారం.

Telangana: తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖ‌రారైంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంట‌ల‌కు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌/ పొడిగింపు, కరోనా పరిస్థితులు, వైర‌స్ క‌ట్ట‌డికి శాఖల వారీగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, క‌రోనా మూడోద‌శ విజృంభ‌ణ‌కు స‌న్న‌ద్ధం, వైద్యం, నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. కరోనా తీవ్ర నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మే 12 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నా సంగతి తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో తెలంగాణ సర్కార్ అన్‌లాక్ ప్రక్రియపై దృష్టి సారించినట్టుగా సమాచారం.

అలాగే, రైతుబంధు, వ్యవసాయ పనులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జ‌ర‌పనున్నారు. ఈ వానాకాలం సాగునీరు, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు చేపట్టిన చర్యలపై, తదితర అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనుంది. అలాగే జూన్ 9 నుండి అన్ని జిల్లాల్లో ప్రారంభం కావాల్సిన డయాగ్నస్టిక్ సెంటర్లపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొని ఏకకాలంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రలు ఎక్కడెక్కడ పా`ల్గొనాలనే విషయంపై మంగళవారం జరిగే కేబినెట్ భేటీ లో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories