Telangana Cabinet Meet: ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ భేటీ

Arun Chilukuri
Published on: 1 Aug 2020 3:11 PM IST
Telangana Cabinet Meet: ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ భేటీ
X

Telangana Cabinet Meet: ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో సెక్రటేరియట్‌ నూతన భవన సముదాయం నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కోవిడ్‌-19 పరిస్థితులు, కరోనా నేపథ్యంలో విద్యా రంగంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 64,786 కి చేరింది. మృతుల సంఖ్య 530కి పెరిగింది. కరోనా నుంచి కోలుకోని మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 46,502 కి చేరింది. ప్రస్తుతం 17,754 మంది చికిత్స పొందుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story