Telangana New Ration Card: రేషన్ కార్డులపై బిగ్ అప్‎డేట్..త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేస్తామన్న మంత్రి

Telangana New Ration Card: రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలోనే రాష్ట్రంలో రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు 1వ తేదీన మంత్రివర్గం భేటీలో విధివిధానాలను ఖరారు చేస్తామని చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Dhivi
Updated on: 31 July 2024 5:01 AM IST
Telangana New Ration Card: రేషన్ కార్డులపై బిగ్ అప్‎డేట్..త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేస్తామన్న మంత్రి
X

తెల్ల రేషన్ కార్డుల ఉన్నవారందరికీ రూ. 500 సిలిండర్ ఇస్తామన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషర్ కార్డుపై అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ సమాధానం ఇచ్చారు.

కేసీఆర్ చర్యలతో రాష్ట్రంలో ధాన్యం గణనీయంగా పెరిగిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్..పౌరసరఫరాల శాఖధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేదన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలవలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సన్నబియ్యం టెండర్లు రద్దు చేశారని ప్రశ్నించారు.

కొత్త రేషన్ కార్డులు అంటున్నారు..ఎప్పుడు ఇస్తారని అడిగారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నలకు స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుల జారీపై పైన పేర్కొన్న అంశాలను తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ సన్నబియ్యం పంపినీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Dhivi

Dhivi

Next Story