Telangana: మంత్రివర్గ సమావేశం ప్రారంభం

Telangana: సీఎం కేసీఆర్‌ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది.

Arun Chilukuri
Published on: 8 Jun 2021 2:59 PM IST
Telangana Cabinet Meeting started in Pragati Bhavan
X

కేసీఆర్‌(ఫైల్ ఇమేజ్ )

Telangana: సీఎం కేసీఆర్‌ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. ప్ర‌గతి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌ర‌య్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, పింఛనర్ల వేతన సవరణ (పే రివిజన్‌) అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపింది? తీసుకోవాల్సిన చర్యలేంటి? తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం తగిన నిర్ణయాలు తీసుకోనున్నది. అలాగే, వానకాలం పంటలు, సాగునీటి పారుదల అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story