logo
తెలంగాణ

ఈనెల 11న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలపై చర్చ..

Telangana Cabinet Meeting on Thursday
X

ఈనెల 11న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలపై చర్చ..

Highlights

Cabinet Meeting: ఈ నెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశంకానుంది.

Cabinet Meeting: ఈ నెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశంకానుంది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలను చర్చించనుంది. ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా తీసుకునే రుణాల్లో కేంద్రం కోత విధించింది. రూ.53వేల కోట్లలో కేంద్రం రూ.15వేల కోట్లు కోత విధించిందని ఇటీవల సీఎం తెలిపారు. దీంతో పాటు ప్రాజెక్టులు సహా ఇతరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు నిలిచిపోయాయి.

దీంతో ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం.. ఇందుకు సంబంధించి కసరత్తు చేసింది. కొత్త పింఛన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథపిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్‌ చర్చించనుంది.

Web TitleTelangana Cabinet Meeting on Thursday
Next Story