Telangana: ఈటల బర్తరఫ్‌తో మరో బీసీ నేతకే కేబినెట్‌లో ఛాన్స్..?

Telangana: Cabinet Berth to be Filled with BC
x

Telangana: ఈటల బర్తరఫ్‌తో మరో బీసీ నేతకే కేబినెట్‌లో ఛాన్స్..?

Highlights

Telangana: ఈటల వ్యవహారం టీఆర్ఎస్ నేతల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఆయన స్థానంలో మంత్రివర్గంలోకి గులాబీ బాస్ ఎవరిని తీసుకుంటారా అని చర్చ జోరుగా జరుగుతోంది.

Telangana: ఈటల వ్యవహారం టీఆర్ఎస్ నేతల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఆయన స్థానంలో మంత్రివర్గంలోకి గులాబీ బాస్ ఎవరిని తీసుకుంటారా అని చర్చ జోరుగా జరుగుతోంది. సామాజిక వర్గ సమీకరణలు కులాల కోణంలో నిర్ణయం తీసుకుంటారనే అంచనాలో ఉన్నారు కారు పార్టీ నేతలు ఇంతకు ఆశావాహులు ఎవరు..? పదవులు ఎవరిని ఊరిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఒక్క పదవిని భర్తీ చేస్తారా లేక మంత్రివర్గన్నే రీఫిల్ చేస్తారా అనేది టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

తెలంగాణ మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ ను భర్తరఫ్ చేసిన తర్వాత అదే స్థానం లో మళ్లీ ఎవరికి అవకాశం దక్కబోతుందనే చర్చ అధికార పార్టీలో జోరందుకుంది. మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని పార్టీలో కొంత మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నా బీసీ నేతలకే సీఎం అవకాశం ఇస్తారనీ ఈటల గేట్ ఔట్ తో బీసీ లకు అన్యాయం అనే ముద్ర లేకుండా చూస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో పార్టీ లో ఉన్న బీసీ ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలలో క్యాబినెట్ లో అవకాశం అంటూ ఆశలు పెట్టుకున్నారు. జిల్లాల వారీగా బీసీ లీడర్లు తమ బలబలాలను అంచనా పరీక్షించుకుంటున్నారు.

మాజీ మంత్రి ఈటల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బీసీ జనాభా లో ముదిరాజ్ సామాజిక వర్గం 13శాతం ఉంది. అదే కులానికి చెందిన వ్యక్తినే మళ్లీ మంత్రిగా చేయాలని అనుకుంటే పార్టీ ఎమ్మెల్యేలలో ఎమ్మెల్సీల్లో ముదిరాజ్ సామాజిక నేతలు లేరు. రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్ ఒక్కడే ఇదే కులానికి చెందిన వ్యక్తి ఉన్నారు. అయితే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి కేసీఆర్ తన క్యాబినెట్ లోకి తీసుకోవచ్చన్న అంచనాలు గులాబీ పార్టీలో ఉన్నాయి. త్వరలోనే శాసన మండలి లో ఎమ్మెల్యేల కోటా పరిధిలోనీ 6 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రాబోతుంది.

మరోవైపు ఈ ఫార్ములా పని చేయని పక్షంలో కేబినెట్ రీషఫిల్ చేస్తే మరింతమందికి అవకాశం వస్తుంది. బీసీలలోనే ఇతర కులాలకు అవకాశం ఇస్తానని చర్చ సాగుతుంది. దీంతో జిల్లాల వారీగా బీసీ నేతలు మంత్రివర్గంలో చోటు కోసం తమ పేర్లు పరిశీలనలో ఉంటాయని ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం పార్టీ ఎమ్మెల్యేలలో 20మందికి పైగా బీసీలున్నారు. 10మంది వరకు మండలి లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలున్నారు. నిజామాబాద్ నుంచి ఇద్దరు కీలక బీసీ నేతలు అదిలాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి జోగు రామన్న సైతం మళ్లీ అవకాశం ఇస్తారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు అనేక మంది బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పదవీ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం తన పేరు పరిశీలనలో ఉండొచ్చని అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడో వ్యక్తికి అవకాశం ఉంటుందా అనే చర్చ సైతం అధికార పార్టీ లో సాగుతోంది. ఇక మొదటి సారి ఎమ్మెల్యే లు అయినా వారి సంఖ్య బీసీ లలో ఎక్కువగా ఉండటం మండలి లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మంత్రి పదవులు చేపట్టే అంత సీనియర్లు కాకపోవడం తో ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో నని గులాబీ శ్రేణుల మద్య ఆసక్తి కర చర్చ సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories