logo
తెలంగాణ

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Telangana Budget Meetings From Tomorrow
X

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Highlights

Telangana Budget: అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి.

Telangana Budget: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ ఆవరణలో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి.. ఎవరికీ ఇబ్బంది కల్గకుండా చర్యలు తీసుకున్నారు. సోమవారం నుంచి రాష్ట్ర రెండో శాసనసభ 8వ సెషన్, శాసనమండలి 18వ సెషన్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయన్నారు స్పీకర్ పోచారం.

కరోనా ప్రభావం తగ్గినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశాఖ అధికారులు కరోనా టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. శాసనసభ, మండలి సమావేశాలు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ పూర్తి సహాయ, సహకారాలను అందించాలని కోరారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.

Web TitleTelangana Budget Meetings From Tomorrow
Next Story