Telangana: ఎక్సైజ్ శాఖపై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం.. ఆ పేరు మార్చాల్సిందేనంటూ..

Telangana: ఎక్సైజ్ శాఖపై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం.. ఆ పేరు మార్చాల్సిందేనంటూ..

Arun Chilukuri
Published on: 10 Jan 2023 2:54 PM IST
Telangana Brahmins Demand That Change the Name of Vedamritam to Neera Cafe
X

Telangana: ఎక్సైజ్ శాఖపై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం.. ఆ పేరు మార్చాల్సిందేనంటూ..

Telangana: తెలంగాణ ఎక్సైజ్‌ శాఖపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీరా కేఫ్‌కు వేదామృతం పేరు పెట్టడంపై మండిపడ్డాయి. పేరు మార్చాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షుడు కె.వి.రమణాచారికి బ్రాహ్మణ సంఘాలు వినతిపత్రం ఇచ్చాయి. వేదాలను కించపరిచేలా కల్లు కాంపౌండ్‌కు వేదామృతం అని పెట్టిన పేరును తొలగించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో 'నీరాకేఫ్‌' ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్‌ దీనికి శంకుస్థాపన కూడా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story