మోత్కుపల్లి రాజీనామాతో అలర్ట్ అయిన బీజేపీ

BJP: నేతల రాజీనామాలతో తెలంగాణ బీజేపీలో అంతర్మథనం మొదలైంది.

Arun Chilukuri
Updated on: 23 July 2021 9:45 PM IST
Telangana BJP Retrospects its Intuition
X

మోత్కుపల్లి రాజీనామాతో అలర్ట్ అయిన బీజేపీ

BJP: నేతల రాజీనామాలతో తెలంగాణ బీజేపీలో అంతర్మథనం మొదలైంది. ఇటీవల మోత్కుపల్లి, ఎర్ర శేఖర్ బీజేపీకి రాజీనామా చేయడంతో అసంతృప్తులపై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. అయితే మోత్కుపల్లి రాజీనామాను లైట్ తీసుకున్నా ఇతర అసంతృప్త నేతలు పార్టీని వీడకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు అసంతృప్తిలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటికే పలువురు అసంతృప్తులతో మాట్లాడి బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై నగర శివార్లలో ముఖ్య నేతలతో ఆయన రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story