Telangana BJP: విద్యుత్‌ చార్జీల పెంపుపై టీబీజేపీ వినూత్న నిరసన

Telangana BJP: బషీర్‌బాగ్‌లో ప్రజా బ్యాలెట్‌ నిర్వహణ

Rama Rao
Updated on: 28 March 2022 6:30 PM IST
Telangana BJP Protest Over Hike in Electricity Charges
X

Telangana BJP: విద్యుత్‌ చార్జీల పెంపుపై టీబీజేపీ వినూత్న నిరసన

Telangana BJP: విద్యుత్‌ చార్జీల పెంపును నిరిసిస్తూ తెలంగాణ బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది. బషీర్‌బాగ్‌లోని మహంకాళీ అమ్మవారి ఆలయం వద్ద ప్రజా బ్యాలెట్‌ నిర్వహించింది. పెంచిన విద్యుత్‌ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశారు పార్టీ నేతలు. అయితే భారీగా బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరవడంతో అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వానికి పోలీసులు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారంటూ కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story