గీత దాటిన వారిపై వేటు వేసేందుకు సిద్ధమైన తెలంగాణ బీజేపీ

Telangana BJP is Ready to Hold Stick on Those Who Crossed the Line
x

గీత దాటిన వారిపై వేటు వేసేందుకు సిద్ధమైన తెలంగాణ బీజేపీ

Highlights

Telangana BJP: తెలంగాణ బీజేపీలో నియమాల్ని ఉల్లంఘించిన నేతలపై వేటుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది.

Telangana BJP: తెలంగాణ బీజేపీలో నియమాల్ని ఉల్లంఘించిన నేతలపై వేటుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఛైర్మన్ ధర్మారావు అధ్యక్షతన సమావేశమైన కమిటీ.. పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న వారిపై చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పార్టీ శ్రేణుల నుండి అందిన ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మాట్లాడిన అనంతరం సస్పెన్షన్‌పై నిర్ణయం వెలువరించనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories