Telangana BJP: రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలకు నిరసనగా దీక్ష

Telangana BJP: ప్రజాసంగ్రామ యాత్ర దగ్గర బండి, డి.కె.అరుణ దీక్ష

Rama Rao
Updated on: 20 April 2022 1:35 PM IST
Telangana BJP Initiation  Protest | TS News
X

Telangana BJP: రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలకు నిరసనగా దీక్ష

Telangana BJP: తెలంగాణలో హత్యలు ఆత్మహత్యలు, అత్యాచారాలతో టిఆర్ఎస్ దాష్టీకాలకు పాల్పడుతోందని బిజెపి నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం దగ్గర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యాక్షురాలు డి.కె.అరుణతో పాటు పలువురు నిరసన దీక్షలో కూర్చుకున్నారు. టిఆర్ఎస్ నేతల దౌర్జన్యాలకు నిరసనగా బిజెపి నేతలు ముఖాలకు నల్ల మాస్క్‌లు ధరించి దీక్షలో పాల్గొన్నారు. మహాత్మాగాంధి, అంబేద్కర్ చిత్ర పటాలకు నివాళులు అర్పించి నేతలు 'నిరసన దీక్ష'లో కూర్చున్నారు. మౌన దీక్షకు ముఖ్య అతిథిగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ప్రహ్లద్ సింగ్ పటేల్ హాజరయ్యారు. రాష్ట్రంలో బిజెపి కార్యకర్తలపై దాడులపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.


Rama Rao

Rama Rao

Next Story