హుస్నాబాద్‌లోనే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ

* ఎన్నికల కోడ్‌ కారణంగా వచ్చే నెల 2వరకు సిద్దిపేట జిల్లాలోనే పాదయాత్ర

Sandeep Reddy
Updated on: 30 Sept 2021 9:14 AM IST
Telangana BJP Chief Bandi Sanjay Praja Sangrama Yatra Concluding Meeting in Husnabad
X

బండి సంజయ్‌ (ట్విట్టర్ ఫోటో)

Praja Sangrama Yatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను హుస్నాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం హుజూరాబాద్‌లో ముగింపు సభ అనుకున్నప్పటికీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడటంతో హుస్నాబాద్‌లో సభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున వచ్చే నెల 2వరకు సిద్దిపేట జిల్లాలోనే పాదయాత్ర కొనసాగించనున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

అందులో భాగంగానే ఇవాళ కోహెడ నుంచి ప్రారంభమయ్యే ప్రజా ప్రజా సంగ్రామ యాత్ర శ్రీరాములపల్లి, పర్వేద, పందిళ్ల మీదుగా పొట్లపల్లి వరకు మొత్తం 13 కి.మీ మేర కొనసాగుతుందని తెలిపారు. తొలిదశ పాదయాత్ర ముగింపు సందర్భంగా అక్టోబరు 2న హుస్నాబాద్‌ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story