Bandi Sanjay: సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు

Bandi Sanjay: ఈ చావులన్నింటికీ సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలదే బాధ్యత

Rama Rao
Published on: 16 April 2022 1:01 PM IST
Telangana BJP Chief Bandi Sanjay Hot Comments | TS News
X

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు 

Bandi Sanjay: టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి మృతికి ప్రభుత్వమే కారణమని విరుచుకుపడ్డారు. మంత్రి పువ్వాడ అరాచకాలు, టీఆర్ఎస్‌ అవినీతిపై సోషల్‌ మీడియాలో ప్రశ్నించినందుకు సాయి గణేష్‌పై 16 కేసులు పెట్టారని ఆరోపించారు. అలాగే సాయి గణేష్‌పై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని చూశారని, దాంతో మనస్తాపంతో సాయి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడన్నారు.

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సాయి మృతికి మంత్రి పువ్వాడ, పోలీసులు బాధ్యత వహించాలన్నారు. అలాగే మెదక్‌ జిల్లా రామాయంపేట్‌ ఘటనపైనా బండి సంజయ్‌ స్పందించారు. సంతోష్‌, అతని తల్లి స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ వేధింపులు భరించలేక చనిపోతున్నట్టు వీడియో పెట్టి లాడ్జిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఈ చావులన్నింటికీ సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలే బాధ్యత వహించాలన్నారు బండి సంజయ్.

Rama Rao

Rama Rao

Next Story