Telangana: కేసీఆర్ అసలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా: బండి సంజయ్

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్

Arun Chilukuri
Published on: 28 April 2021 4:55 PM IST
Bandi Sanjay Comments On Cm KCR
X

బండి సంజయ్ ఫైల్ ఫోటో  

Telangana: సీఎం కేసీఆర్ అసలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోడీకి పేరు వస్తుందనే భయంతోనే టీకా తీసుకోమని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు చెప్పడంలేదని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లోనున్న భారత్ బయోటెక్ టీకా ధర తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. రాష్ట్రానికి ఆక్సిజన్ ఎంతో అవసరం అన్నదానిపై ప్రభుత్వం వద్ద ఒక్క నివేదిక కూడా లేదని బండి సంజయ్ విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story