జనగామ ఘటనపై టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఫైర్‌

Telangana Bharatiya Janata Party Chief Bandi Sanjay Warned Police Department on Jangaon Issue
x

Bandi Sanjay (file Image)

Highlights

* రేపు చలో జనగామకు పిలుపునిచ్చిన బండి సంజయ్‌ * లాఠీఛార్జ్‌ చేసిన పోలీసులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్

జనగామ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్‌ చేసిన పోలీసులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రేపు చలో జనగామకు పిలుపునిచ్చిన బండి సంజయ్ రాష్ట్రంలోని పోలీసులకు బీజేపీ వ్యతిరేకం కాదని కానీ, బీజేపీ కార్యకర్తల రక్తాన్ని కళ్లచూస్తున్న కొంతమంది పోలీసు అధికారులను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో గడీల పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందని అన్నారు బండి సంజయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories