Cough Syrups: తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం

Cough Syrups: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'రీలైఫ్‌' (Relief), 'రెస్పీఫ్రెష్‌-టీఆర్‌' (Respifresh-TR) అనే రెండు దగ్గు మందుల విక్రయాలను తక్షణమే నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 8 Oct 2025 4:23 PM IST
Cough Syrups: తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం
X

Cough Syrups: తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం

Cough Syrups: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'రీలైఫ్‌' (Relief), 'రెస్పీఫ్రెష్‌-టీఆర్‌' (Respifresh-TR) అనే రెండు దగ్గు మందుల విక్రయాలను తక్షణమే నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ఔషధాలలో కల్తీ (adulteration) జరిగినట్లు గుర్తించిన కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందులు గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీల ద్వారా తయారవుతున్నట్లు తెలిసింది.

ఇటీవల మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్‌రిఫ్‌’ (Coldriff) అనే దగ్గు మందును వాడటం వలన పలువురు చిన్నారులు మరణించినట్లు ఆరోపణలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఔషధ నియంత్రణ విభాగం (DCA) అప్పటికే ‘కోల్డ్‌ రిఫ్‌’ దగ్గు మందును పూర్తిగా నిషేధించింది. తాజాగా, మరో రెండు మందుల్లో కల్తీని గుర్తించడంతో, వాటిని కూడా నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story