తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం నేడు నోటిఫికేషన్ విడుదల

Telangana: స్పీకర్ నామినేషన్ల కోసం రెండు రోజుల గడువు

Jyothi
Published on: 11 Dec 2023 12:19 PM IST
Telangana Assembly Speaker Election Notification Release Today
X

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం నేడు నోటిఫికేషన్ విడుదల

Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల కోసం నేడు నోటిఫికేషన్ విడుదల చేశారు అసెంబ్లీ సెక్రటరీ వి.నర్సింహాచార్యులు.. స్పీకర్ పదవికి నామినేషన్లు సమర్పించడానికి రెండు రోజుల గడువు ఇచ్చారు. కాగా ఈనెల 14న తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 15న శాసన సభ, శాసన మండలి జాయింట్ సెషన్స్ సమావేశం జరుగుతుంది. అదే రోజు అసెంబ్లీలో తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు. 16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశ పెడతారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తారు.

Jyothi

Jyothi

Next Story