Telangana Assembly Sessions: క‌రోనా వేళ అసెంబ్లీలో జ‌రుగ‌నున్న వాడి వేడి చ‌ర్చ‌.. పటిష్ఠ బందోబస్తు

Telangana Assembly Sessions:  క‌రోనా వేళ అసెంబ్లీలో జ‌రుగ‌నున్న వాడి వేడి చ‌ర్చ‌.. పటిష్ఠ బందోబస్తు
x

telangana assembly sessions to start from monday

Highlights

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ, శాస‌న మండ‌లి స‌మావేశాలు రేప‌టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం పోలీసులు ప‌టిష్ఠ‌మైన బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశాలు రేప‌టి నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జ‌రుగనున్నాయి

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ, శాస‌న మండ‌లి స‌మావేశాలు రేప‌టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం పోలీసులు ప‌టిష్ఠ‌మైన బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశాలు రేప‌టి నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జ‌రుగనున్నాయి. ఈ మేర‌కు ఆరు వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేసిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

భద్రతా పర్యవేక్షణ ఇన్చార్జ్ అధికారిగా జాయింట్ పోలీసు కమిషనర్ సెంట్రల్ జోన్ ఇన్చార్జి విశ్వ ప్రసాద్ భాద్య‌త‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. ఈ త‌రుణంలో అసెంబ్లీ సమావేశాలకు విధులు నిర్వహించే 650 మంది పోలీసులకు క‌రోనా టెస్ట్ లు నిర్వహించారు. ఇందులో ముగ్గురికి పాజిటివ్ రావడంతో వారిని ఐసోలేషన్ పంపిచేసిన పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

600మంది పోలీసులతో పాటు అదనంగా మఫ్టి, ఐడి, ఎస్ బి, ఇంటలిజెన్స్, సిటీ కమాండో, సిటీ ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్, సిటీ పిక్ యాక్షన్ ఫోర్స్ తో పాటు తెలంగాణ బెటాలియన్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ట్రాఫిక్, సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ బృందాలతో పటిష్ట వంతమైన భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు.

ఈ స‌మావేశంలో కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యంతో పాటు సచివాలయం కూల్చివేత, శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదం, ఉస్మానియా ఆస్పత్రి భవనం అంశాలపై సభా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని విప‌క్షాలు స్పష్టం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories