అసెంబ్లీ సమావేశాల కుదింపుపై చర్చించిన మండలి చైర్మన్, స్పీకర్

X
Highlights
అసెంబ్లీ వానాకాల సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. సమావేశాలకు వస్తున్న సభ్యులు...
Arun Chilukuri16 Sep 2020 4:37 AM GMT
అసెంబ్లీ వానాకాల సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. సమావేశాలకు వస్తున్న సభ్యులు కరోనా బారిన పడుతున్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ వానాకాల సమావేశాల షెడ్యూల్‌ను కుదిస్తూ, సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో వర్షాకాల సమావేశాలు కొనసాగించే అంశంపై చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో మండలి చైనర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశాల కుదింపుపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయంపై మరోమారు పార్టీల అభిప్రాయం తీసుకువాలని నిర్ణయించారు.
Web TitleTelangana assembly session 2020 may postpone
Next Story