కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly: ప్రమాణస్వీకారం చేయనున్న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు

Jyothi
Published on: 9 Dec 2023 11:08 AM IST
Telangana Assembly Meetings
X

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. అంతకు ముందు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేయించారు.

ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తిరిగి అసెంబ్లీ 13 లేదా 14 నుంచి ప్రారంభంకానుంది. పున:ప్రారంభమైన తొలిరోజున స్పీకర్ ను ఎన్నుకుంటారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆ తర్వాత ఎన్ని రోజులు సభ నిర్వహించాలనేది స్పీకర్ ఎన్నిక అనంతరం జరిగే బీఏసీలో నిర్ణయిస్తారు.

Jyothi

Jyothi

Next Story