Top
logo

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
X
Highlights

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ...

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కరోనా వల్ల అనుకున్న సమయం కన్నా ముందే సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీ వరకు అసెంబ్లీని నిర్వహించాలనుకున్నా ఇద్దరు సభ్యులకు, సిబ్బందికి పాజిటివ్‌ రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభ‌మైన స‌మావేశాలు నేటి వ‌ర‌కు కొన‌సాగాయి. బీఏసీ కమిటీ సూచనల మేరకు శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాల్లో కీలకమైన నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ, మండలి ఆమోదం తెలిపాయి. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించిన సభ్యులకు స్పీకర్‌ పోచారం ధన్యవాదాలు తెలిపారు.


Web TitleTelangana Assembly Adjourned
Next Story