Nizamabad: అమెరికా అమ్మాయి-ఆర్మూర్‌ అబ్బాయి.. ఖండాలు దాటి పెళ్లి పీటలెక్కిన ప్రేమజంట

Nizamabad: ఆర్మూర్‌లో కళ్యాణ వేడుకతో ఒక్కటైన ప్రేమ జంట

Jyothi
Updated on: 24 Jan 2023 7:30 PM IST
Telangana Armur Man Married American Girl
X

Nizamabad: అమెరికా అమ్మాయి-ఆర్మూర్‌ అబ్బాయి.. ఖండాలు దాటి పెళ్లి పీటలెక్కిన ప్రేమజంట

Nizamabad: విధి నిర్వహణలో పరిచయమైన ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పంచి పెళ్లిపీటలెక్కారు. ఖండాలు దాటిన వీరి ప్రేమ పెళ్లితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని గోవిందుపేట గ్రామానికి చెందిన మూగ ఆకాష్‌ చర్చి ఫాదర్లకు క్లాసులు నిర్వహిస్తూ సేవలందిస్తున్నాడు. యూఎస్‌ఏ చెందిన అలెక్స్‌ ఓల్సా నర్సింగ్‌ పూర్తి చేసి ఇండియాలో క్రైస్తవ సంస్థల్లో నర్సుగా సేవలందిస్తుంది. ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురు పెద్దలను ఒప్పంచి ఆర్మూర్‌లో కల్యాణవేడుకతో ఒక్కటయ్యారు. ఎల్లలు దాటిన ఈ ప్రేమజంటను ఆశీర్వదించడానికి అమెరికా నుండి వధువు తరఫు బంధువులు తరలివచ్చారు.

Jyothi

Jyothi

Next Story