Weather Update: తెలుగు రాష్ట్రాలకు 'ఎండ' గండం: వచ్చే 48 గంటలు అత్యంత కీలకం.. వాతావరణ శాఖ వార్నింగ్!

Weather Update: తెలుగు రాష్ట్రాలకు 'ఎండ' గండం: వచ్చే 48 గంటలు అత్యంత కీలకం.. వాతావరణ శాఖ వార్నింగ్!
Weather Update: తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వచ్చే రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నట్ల వాతావరణశాఖ హెచ్చరించింది.
Weather Update: తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వచ్చే రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నట్ల వాతావరణశాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఈనెల 15వ తేదీ వరకు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలుగురాష్ట్రాల్లో పగటి వేళ 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. నగరాలు, పట్టణాల్లో వేడి గాలులు కూడా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
రాత్రి సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే వచ్చే వారం నుంచి వాతావరణంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఈనెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందని తెలిపారు. అందువల్ల ప్రజలు ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



