Telangana: కమలం గూటికి ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్

Telangana: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కమలం గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది.

Arun Chilukuri
Updated on: 12 Jun 2021 2:35 PM IST
Adilabad Ex-MP Ramesh Rathod may join BJP
X

రమేష్ రాథోడ్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా ) 

Telangana: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కమలం గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈటలతో కలిసి జేపీ నడ్డా సమక్షంలో ఈ నెల 14న కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు రాథోడ్. నిన్న హైదరాబాద్‌లో ఈటల నివాసంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో జరిగిన చర్చలు సఫలం కావడంతో.. రాథోడ్‌ బీజేపీలో చేరడం ఖాయమైంది. రాథోడ్‌ చేరికతో జిల్లాలో బీజేపీ మరింత బలపడనుంది. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు నేత‌లు కూడా క‌మ‌లం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story