దారుణం: 60కి పైగా కోతులను చంపిన గుర్తుతెలియని వ్యక్తులు

Arun Chilukuri
Published on: 18 Nov 2020 6:17 PM IST
దారుణం: 60కి పైగా కోతులను చంపిన గుర్తుతెలియని వ్యక్తులు
X

మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారులో విష ప్రయోగంతో మృతిచెందిన వానరాలకు అటవీశాఖ అధికారులు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం రాత్రి శనిగపురం గ్రామ శివారు గుట్టల్లో సుమారు ఆరవైకి పైగా కోతులకు విష ప్రయోగం చేసి హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై స్పందించిన బీజేపీ నాయకులు హనుమంతుని ప్రతిరూపంగా కొలిచే వానరాలను ఇలా విష ప్రయోగం చేసి హతమార్చడం హేయమన్నారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story