నిట్ వరంగల్‌లో ఘనంగా టెక్నోజియాన్‌-24 మహోత్సవం

Nit Warangal: నూతన ఆవిష్కరణలకు వేదికగా మారిన టెక్నోజియాన్‌–24

Jyothi
Published on: 21 Jan 2024 10:31 AM IST
Technozion-24 Mahotsavam in Nit Warangal
X

నిట్ వరంగల్‌లో ఘనంగా టెక్నోజియాన్‌-24 మహోత్సవం

Nit Warangal: నిట్‌ వరంగల్‌లో ప్రతి ఏడాది విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–24 ఘనంగా ప్రారంభమైంది. టెక్నోజియాన్‌–24 ఇంజీనియస్‌ను 40 టెక్నికల్‌ ఈవెంట్లతో రూపాందించారు. మూడు రోజుల్లో స్పాట్‌లైట్స్‌ పేరిట జహాజ్‌, ఆర్‌సీ బగ్గీ, హోవర్‌ మానియా, వర్చ్యువల్‌ రియాల్టీ, డీ బగ్గింగ్‌ మానియాలతో అలరించనుంది.

మ్యాట్‌ల్యాబ్‌, టీ–వర్క్స్‌, రాపిడ్‌ ప్రోటో టైపింగ్‌, సిమూలింక్‌ మాస్టర్‌, ఇన్సోసర్చ్‌ వంటి వర్క్‌షాప్స్‌ ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిట్‌ మెకానికల్‌ విభాగానికి చెందిన స్పర్థక్‌ టీం వెహికిల్‌ ఎగ్జిబిషన్‌ ప్రత్యేకంగా నిలువనుంది. సాంకేతిక విద్యనభ్యసించే విద్యార్థులు సమాజానికి దోహదపడే నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు వేదికగా ఇంజీనియస్‌ టెక్నోజియాన్‌–24 నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story