Top
logo

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
X
Highlights

మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. సాంకేతికలోపం కారణంగా విమానం ఎమర్జెన్సీ...

మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. సాంకేతికలోపం కారణంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టు తెలుస్తోంది. ముంబై నుండి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ఫైలెట్ సిబ్బంది టేకాఫ్ అయిన అరగంటకే విమానాన్ని తిరిగి ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో 120మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నట్టు సమాచారం. షూటింగ్ నిమిత్తం ఆయన ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. విమానంలో లోపాన్ని సకాలంలో ఫైలట్ గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో విమానంలో ప్రయాణికుల్ని హైదరాబాద్‌కు పంపించారు అధికారులు.

Next Story